ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్ రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి' - మేకపాటి తాజా వార్తలు

కొవిడ్ రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రులు అనిల్ కుమార్ , మేకపాటి అధికారులకు సూచించారు. నెల్లూరు జీజీహెచ్, నారాయణ కొవిడ్ కేంద్రాలను సందర్శించిన మంత్రులు..రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

nellore ministers visit covid hospitals
'కొవిడ్ రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి'

By

Published : May 14, 2021, 7:58 PM IST

నెల్లూరు జీజీహెచ్, నారాయణ కొవిడ్ కేంద్రాలను మంత్రులు మేకపాటి, అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రులు..ఆస్పత్రిలో పడకల వివరాలు, ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ అందుబాటు తదితర విషయాలపై ఆరా తీశారు. రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ప్రైవేటు ఆసుపత్రిలో కొవిడ్ రోగుల నుంచి వసూళు చేస్తున్న అధిక బిల్లులపై పలు అపోహలు ఉన్నాయన్నారు. బిల్లుల విషయంలో పారదర్శకత అవసరమన్నారు. ఆ మేరకు ప్రైవేట్ ఆస్పత్రులు చర్యలు తీసుకోవాలని మంత్రి అనిల్ సూచించారు. వైద్య ఖర్చుల విషయంలో తారతమ్యం లేకుండా చూసుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details