ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరును స్మార్ట్ సిటీగా చేస్తా : నారాయణ - నెల్లూరును స్మార్ట్ సిటీగా చేస్తా : నారాయణ

నెల్లూరు ప్రచారంలో తెదేపా దూసుకెళ్తోంది. నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్‌లో కాపు సంఘాల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి నారాయణ... ప్రభుత్వం చేపట్టిన పథకాలు వివరించారు.

నెల్లూరును స్మార్ట్ సిటీగా చేస్తా : నారాయణ

By

Published : Apr 1, 2019, 10:47 AM IST

నెల్లూరు నగరంలో తెదేపాఎమ్మోల్యే అభ్యర్థి మంత్రి నారాయణ ప్రచారం
నెల్లూరులో మంత్రి నారాయణ విస్తృతంగా పర్యటిస్తున్నారు. తెలుగుదేశాన్ని గెలిపిస్తే... చేయబోయే హామీలు వివరిస్తున్నారు. వివిధ వర్గాలతో సమావేశమై... తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.కస్తూరిదేవి గార్డెన్స్‌లో కాపు సంఘాల ఆత్మీయ సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి బీదామస్తాన్‌రావుతో కలిసి హాజరై సైకిల్‌ గుర్తుపై ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.గతంలో ఎప్పుడూ లేని విధంగా నగరానికి 5200 కోట్ల నిధులువెచ్చించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. తాను గెలుపొందిన తర్వాత స్మార్ట్ సిటీగా చేస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details