సరిలేరు నీకెవ్వరూ ఫైట్లను తమ శైలిలో తెరకెక్కించి తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిన నెల్లూరు కుర్రాళ్లు మరో వీడియోను నెట్టింట్లో పెట్టారు. ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఖైదీ నంబర్ 150 చిత్రంలోని ఇంటర్వెల్ ఫైట్ సీన్‌ను అచ్చుగుద్దినట్లు దింపేశారు.
మెగాస్టార్ పుట్టినరోజుకు నెల్లూరు కుర్రోళ్లు చిరు కానుక - chiranjeevi birth day news
సినిమాల్లోని యాక్షన్ సీన్లకు లోకల్ టాలెంట్ జతచేసి సరిలేరు మీకెవ్వరూ అని ప్రశంసలు అందుకున్న నెల్లూరుకు చెందిన చిచ్చర పిడుగులు...మరో వీడియోను విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కానుగా దీనిని విడుదల చేసినట్లు చెప్పారు.
nellore kurrollu released khadi number 150 fight spoof video
పదేళ్ల లోపు చిచ్చరపిడుగులతో మొబైల్లోనే ఫైట్ సీన్‌ను తీశాడు నెల్లూరుకు చెందిన కిరణ్(19). ఐయామ్ వెయిటింగ్ అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్స్‌ను ఈ వీడియోలో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.