'సరిలేరు నీకెవ్వరు' స్పూఫ్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించారు. మెగాస్టార్‌కు బర్త్‌డే విషెస్ చెప్పి వావ్ అనిపించారు. ఇప్పుడు గబ్బర్‌సింగ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని.. గబ్బర్‌సింగ్ స్పూఫ్ చేసి.. మళ్లీ సోషల్ మీడియాలో చెలరేగిపోయారు. ఆ సినిమాలో అందరినీ ఆకట్టుకున్న అంత్యక్షరి సీన్‌ను సెల్ఫోన్లో చిత్రీకరించి.. పవర్ స్టార్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు.
పవర్ స్టార్‌కు నెల్లూరు కుర్రాళ్ల బర్త్ డే గిఫ్ట్.. మళ్లీ ఇరగదీశారు! - పవర్ స్టార్‌కు నెల్లూరు కుర్రాళ్ల బర్త్ డే గిఫ్ట్ న్యూస్
నెల్లూరు కుర్రాళ్లు మళ్లీ ఇరగదీశారు. సోషల్ మీడియాలో మరోసారి మన ముందుకొచ్చారు. ఇప్పటికే తమ టాలెంట్‌తో సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులను తమ వైపు చూసేలా చేసిన ... చిచ్చర పిడుగులు.. సోషల్ మీడియాను మరోసారి షేక్ చేయడానికి వచ్చారు. ఈసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు.
nellore kurrallu birthday wishes to pawan kalyan