కొవిడ్‌తో మరణించిన వారి మృతదేహాలను గౌరవంతో అంత్యక్రియలు నిర్వహించాలని జిల్లా సంయుక్త పాలనాధికారి ప్రభాకర్ రెడ్డి కోరారు. బరియల్ గ్రౌండ్లో అంత్యక్రియలు నిర్వహించే ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అంత్యక్రియల విషయంలో బంధువులు కూడా భయపడాల్సిన అవసరం లేదని...తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వివరించారు.
భయపడవద్దు.. అంత్యక్రియలు గౌరవంగా నిర్వహించండి: జాయింట్ కలెక్టర్ - corona dead bodies
కొవిడ్ మృతదేహాల అంత్యక్రియల విషయంలో ప్రజలెవరూ భయపడవద్దని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ బారిన పడకుండా ఉంటామని వివరించారు.
Funerals for corona dead bodies