రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదు కావడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. తొలి కేసు నమోదైన నెల్లూరు జిల్లాలో యంత్రాంగం వైరస్ వ్యాప్తి కాకుండా అన్ని చర్యలూ తీసుకుంటోంది. మిలాన్ నుంచి వచ్చిన 27 ఏళ్ల యువకున్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రత్యేక వార్డులో వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ వ్యాధి వ్యాప్తి కాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆరు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేశారు. ఈ పరిస్థితులను పరిశీలించేందుకు ప్రత్యేక నోడల్ అధికారిగా జేసీ వినోద్ కుమార్ను నియమించారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులపై నోడల్ అధికారితో మా ప్రతినిధి ముఖాముఖి..!
'అందరూ మాస్కు వేసుకోవాల్సిన పని లేదు' - nellore corona latest news
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా అధికారులు అన్ని చర్యలూ చేపట్టారు. తొలి కేసు నమోదైన నెల్లూరులో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే పాఠశాలలకు కలెక్టర్ సెలవులు ప్రకటించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనాపై పరిస్థితి సమీక్షించేందుకు నోడల్ అధికారిగా జేసీని నియమించారు. అయితే అందరూ మాస్కులు వేసుకోవాల్సిన పని లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
నెల్లూరులో కరోనా కేసు నివారణ చర్యలపై మాట్లాడుతున్నజేసీ వినోద్ కుమార్