ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లికి 20 మంది... మద్యం షాపులకు వందలాది మందా? - nellore janasena leaders update news

వివాహాలకు 20 మందినే అనుమతిస్తున్న ప్రభుత్వం... మద్యం దుకాణాల వద్ద వందలాది మంది వస్తున్నా, ఎందుకు పట్టించుకోవటం లేదని నెల్లూరు జనసేన నేతలు ప్రశ్నించారు.

janasena leaders agitation against wine shops
నెల్లూరు జనసేన నేతలు

By

Published : Jul 27, 2020, 5:44 PM IST

నెల్లూరు జనసేన నేతలు ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం... కరోనా కష్టకాలంలో పోలీసుల రక్షణ మద్య మద్యం అమ్మాల్సిన అవసరం ఏమెుచ్చిందని నిలదీశారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా అమ్మకాలు సాగిస్తున్న మద్యం దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. వివాహాలకు 20 మందినే అనుమతిస్తున్న ప్రభుత్వం... మద్యం దుకాణాల వద్ద మందల మంది చేరుతున్నా ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో మద్యం దుకాణాలను మూయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జనసేన నేత కిషోర్ డిమాండ్ చేశారు. మద్యం దుకాణాల వద్ద మందుబాబులు భౌతిక దూరం పాటించాలని సూచించేలా... పెయింటింగ్ వేశారు. అనంతరం నేతలు మాస్కులు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details