ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆరు నెలలుగా జీతాలు చెల్లించకుండా.. ఇప్పుడు తొలగిస్తారా?'

నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి ఒప్పంద సిబ్బంది రోడ్డుపై ధర్నాకు దిగారు. ఆరు నెలలుగా జీతాలు చెల్లించకుండా.. ఇప్పుడు తమను తొలగించడంపై నిరసన వ్యక్తం చేశారు. వెంటనే విధుల్లోకి తీసుకుని.. వేతనాలు విడుదల చేయాలంటూ.. రహదారిపై బైఠాయించారు.

ggh contract employees protest
జీజీహెచ్ ఒప్పంద ఉద్యోగుల ధర్నా

By

Published : Nov 7, 2020, 4:58 PM IST

కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసినా.. వేతనాలు ఇవ్వలేదని 1,200 మంది నెల్లూరు జీజీహెచ్ ఒప్పంద సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఎదురుగా రోడ్డుపై బైఠాయించడంతో.. వందలాది వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. పోలీసులు, అధికారులు నచ్చచెప్పినా వినకుండా.. రోడ్డును దిగ్భంధం చేశారు.

అత్యవసరంగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు కల్పించగా.. ఆరునెలలుగా ఆసుపత్రిలో సేవలు అందించామని సిబ్బంది తెలిపారు. వేతనాలు ఇవ్వకపోవడంపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. కరోనా ఉద్ధృతి తగ్గిందని, మీ సేవలు అవసరం లేదని.. తమను వెళ్లిపొమ్మన్నారని వాపోయారు. తొలగించిన ఒప్పంద సిబ్బందిని విదుల్లోకి తీసుకోవాలని.. ఆరు నెలలుగా ఇవ్వాల్సిన వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ నాయకుడు మధు.. ఆందోళనకారులకు మద్ధతు తెలిపారు.

ఇదీ చదవండి:ఏం సాధించారని పాదయాత్ర ఉత్సవాలు?: భాజపా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details