నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని కోపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ వద్ద అర్థనగ్న ప్రదర్శనతో ధర్నా నిర్వహించారు. వేతనాలు వెంటనే చెల్లించాలని పలువురు కార్మికులు ఫ్యాక్టరీ క్రేన్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.
వేతనాల కోసం కార్మికులు అర్థనగ్న ప్రదర్శన - nellore dst sugar factor workers news
వేతనాల కోసం నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని కో ఆపరేటీవ్ ఘగర్ ఫ్యాక్టరీ కార్మికులు ఆందోళన చేపట్టారు. లాక్ డౌన్ కారణంగా తమ పరిస్థితి చాలా ఇబ్బందిగా మారిందని, దయచేసి వెంటనే వేతనాలు చెల్లించాలని అర్థనగ్న ప్రదర్శన చేశారు.
![వేతనాల కోసం కార్మికులు అర్థనగ్న ప్రదర్శన nellore dst sugar factory workers protest for their wages](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7432463-659-7432463-1591010105937.jpg)
nellore dst sugar factory workers protest for their wages
ఏడు సంవత్సరాల నుంచి దాదాపు 1500 మందికి 22 కోట్ల రూపాయల వేతనాలు చెల్లించాల్సి ఉన్నా, నేటికీ ఎవరూ పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు లేకపోడానికి తోడు లాక్ డౌన్ తో తమ పరిస్థితి దుర్భరంగా తయారైందని వారు వాపోయారు.
ఇదీ చూడండి