నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఇసుకపల్లిలో ఇటీవల కరోనా వైరస్ సోకి డిశ్చార్జ్ అయిన మహిళకు అధికారులు మరో 14 రోజులు హోమ్ క్యారంటైన్లో ఉండమని ఆదేశాలు ఇచ్చారు. ఇంటికే పరిమితమవటంతో నిత్యావసరాలు లేక బాధపడుతుందని తెలిసిన ఎస్ఐ వీరనారాయణ వెంటనే బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరకులు అందజేశారు.
మానవత్వం చాటిన మర్రిపాడు ఎస్ఐ - నెల్లూరు జిల్లా కరోనా వార్తలు
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం, ఇసుకపల్లిలో ఎస్ఐ వీరనారాయణ మానవత్వం చాటుకున్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన మహిళను హోం క్వారంటైన్ చేయటంతో తినేందుకు ఆహారం లేక ఇబ్బందులు పడుతుందని తెలిసి ఎస్ఐ నిత్యావసరాలు అందించారు.
nellore dst marripadu si help to a women