నెల్లూరు జిల్లా బాలాయిపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడి...అందరికీ పనులు దొరుకుతున్నాయా... మంచినీటి వసతి ఉందా వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ సమయంలో మాస్కులు ధరించి పనిచేయాలని కోరారు. ఉపాధి హామీ పనులు వంద రోజులు మాత్రమే లభిస్తున్నాయని. ఎక్కువ రోజులు కల్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ప్రతి రోజు 2లక్షల మందికి ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.
ఉపాధిహామీ పనులను పరిశీలించిన కలెక్టర్ - taja news of nellore dst collector on nregs works
నెల్లూరు జిల్లా బాలాయిపల్లి మండలంలో కలెక్టర్ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. రోజుకు 2 లక్షల మందికి ఉపాధిహామీ పథకం పనికల్పించాలని అధికారులను ఆదేశించారు.

nellore dst collector visits nregs works in balayapalli mandal