ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాడీవేడీగా నెల్లూరు డీఆర్సీ సమావేశం - మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వార్తలు

నెల్లూరు జిల్లా సమీక్షా కమిటీ సమావేశం వాడీవేడీగా సాగింది. డీఆర్సీలో నిర్ణయాలను అధికారులు అమలు చేయడం లేదని... సమస్యలను పరిశీలించడం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ క్లియరెన్స్, ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహణ తీరు సరిగా లేదని సమావేశంలో సభ్యులు ప్రశ్నించారు.

nellore drc meeting
nellore drc meeting

By

Published : Feb 13, 2020, 8:43 PM IST

డీఆర్సీ సమావేశంలో అధికారులపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం

నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం(డీఆర్​సీ) నిర్వహించారు. దీనికి జిల్లా ఇన్​ఛార్జీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు, జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలోనే అధికారులపై ఎమ్మెల్యేలు కాకాని గోవర్థన్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక లేక గ్రామాల్లో ఎన్​ఆర్​జీఎస్ పనులు, సచివాలయాల భవనాల నిర్మాణాల పనులు నిలిచిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. రైతులు పండించిన ధాన్యం ఆరబెట్టుకునేందుకు డ్రైయర్లు లేవని, తేమ శాతం చూసే మిషన్లు చాలడం లేదని వెల్లడించారు. ఇవన్నీ లేకుండా వేగంగా ధాన్యం కొనుగోళ్లు ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు. గత డీఆర్సీలో తీసుకున్న నిర్ణయాలకు అధికారుల నుంచి సమాధానాలు సరిగా లేవని ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో ప్రజా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు జిల్లా అధికారులు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదు. పరిశీలిస్తాం అని మాత్రమే బదులిచ్చారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details