ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు సర్కారు చర్యలు"

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్​లోని నెల్లూరు జిల్లా విద్యార్థుల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ చక్రధర్​ బాబు ఆరా తీస్తున్నారు. అక్కడ విద్యార్ధులను సురక్షితంగా తీసుకొస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం వారంతా బంకర్లలో సురక్షితంగా ఉన్నారని తెలిపారు.

నెల్లూరు జిల్లా విద్యార్థుల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఆరా
నెల్లూరు జిల్లా విద్యార్థుల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఆరా

By

Published : Feb 25, 2022, 8:01 PM IST

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను క్షేమంగా తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నెల్లూరు జిల్లా కలెక్టర్​ చక్రధర్​బాబు అన్నారు. ఉక్రెయిన్​లో ఉన్న జిల్లా విద్యార్దుల వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా సేకరించిన సమాచారం ఆధారంగా విద్యార్ధులకు అవసరమైన సహాయ చర్యలు అందిస్తామని కలెక్టర్​ అన్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ విజయారావు.. ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికి వరకు నెల్లూరు జిల్లాకు చెందిన 20మంది విద్యార్ధులు ఉక్రెయిన్​లో ఉన్నత విద్యకోసం వెళ్లినట్లు సమాచారం. అందులో ఇప్పటివరకు వచ్చిన వివరాల్లో ఆరుగురు మెడిసిన్ చేస్తున్న విద్యార్దులు ఉన్నారు. ప్రస్తుతం వారంతా బంకర్లలో సురక్షితంగా ఉన్నారని తెలిపారు.

యుద్దం కొనసాగితే ఆహారం, తాగునీటి సమస్యలు వస్తాయని.. విద్యార్ధులు తల్లితండ్రులకు చరవాణిలో వారి ఆవేదనను వినిపించారు. బంగర్లలో బిక్కుబిక్కుమంటూ భయాందోళనలో గడుపుతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని తమ పిల్లలను స్వదేశానికి రప్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

  • నెల్లూరు నగరానికి చెందిన వ్యాపారి ఘనీ పిల్లలు బుష్రా, అబూబకర్ సిద్దిక్​తోపాటు నగరానికి చెందిన మరికొంతమంది విద్యార్ధులు వరలక్ష్మి, చైతన్య తేజ, వెంకటాచలం మండలం ఇస్కపల్లికి చెందిన మరో విద్యార్ధి, మర్రిపాడు మండలం పి.నాయుడుపల్లికి చెందన హర్షవర్దన్ ఉక్రెయిన్​లో ఇబ్బంది పడుతున్నట్లు వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. పిల్లలను స్వదేశం తీసుకొచ్చెందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతూ.. కలెక్టర్ చక్రధర్ బాబును కొందరూ కలిసి వినతిపత్రాలు అందజేశారు.
  • వచ్చే నెల 7న ఉక్రెయిన్ నుంచి తమ బిడ్డను రప్పించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకున్న ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో తమ కుమార్తెను క్షేమంగా స్వదేశానికి రప్పించాలని మర్రిపాడు మండలం చిలకపాడుకు రమణారెడ్డి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. రమణారెడ్డి కుమార్తె జీవిఎస్ అమృతా రెడ్డి.. ఉక్రెయిన్​లో మెడిసిన్​ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులను చూసి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను బంకర్​లో ఉంచారని అమృత రెడ్డి తల్లిదండ్రులకు తెలిపింది. కరెంటు ఇంటర్నెట్ సౌకర్యాలు కూడా ఆపేసే అవకాశాలు ఉన్నాయని తెలపడంతో వారు భయపడుతున్నారు.
  • అనంతసాగరం మండలం సంజీవనగరంకు చెందిన గంగినేని సుబ్బరాయుడు కుమారుడు జస్వంత్.. ఉక్రెయిన్​లోని ఎంబీబీఎస్​ చదువుతున్నాడు. ' ఉక్రెయిన్​- రష్యా యుద్ద వాతావరణం నేపథ్యంలో ఉక్రెయిన్​లోని ఇతర దేశాలకు చెందిన విద్యార్థులను కొన్ని రోజుల క్రితం స్వదేశాల తీసుకెళ్లారు. మన ఎంబీసీ అధికారులు మాత్రం ఆదిశగా చర్యలు తీసుకోకపోవడం బాధిస్తుంది. మా కుమారుడు ఫోన్​లో మాట్లాడుతున్న తీరు, అక్కడ ప్రస్తుత పరిస్థితిపై వస్తున్న వార్తలను చూసి భయపడుతన్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి విద్యార్థులంతా సురక్షితంగా వచ్చేలా చర్యలు తీసుకోవాలి' అని సుబ్బరాయుడు కోరుతున్నారు.
  • నెల్లూరు వింజమూరు టీచర్స్ కాలనీకి చెందిన పేరం వెంకట లక్ష్మీ నరసింహ సాయితేజ.. ఎంబీబీఎస్​ చదవు కోసం ఉక్రెయిన్ వెళ్లాడు. ఈ ఏడాది మే 31న కోర్సు పూర్తి కానుంది. స్వదేశానికి వచ్చేందుకు టిక్కెట్ కూడా బుక్​ చేసుకున్నాడు. అతని తండ్రి వింజమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్​.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details