నెల్లూరు జిల్లా సంగం ఆనకట్ట వద్ద ప్రజల వరద కష్టాలివి. సంగం, చేజర్ల, పొదలకూరు మండలాలకు చెందిన 100 గ్రామాల ప్రజలు నిత్యం ఇలా రాకపోకలు సాగిస్తున్నారు. నెలరోజులుగా సోమశిల జలాశయం నుంచి నీటిని వదులుతున్నారు.. డిసెంబరు వరకు వరద కొనసాగే అవకాశం ఉంది. ఆనకట్టకు దిగువన బ్యారేజీ వద్ద పైవంతెన అనుసంధానం పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్యారేజీ వద్ద ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు.
చంకలో బిడ్డలు, భుజాలపై సంచులు.. వరద ప్రవాహంలో రాకపోకలు..! - సంగం ఆనకట్ట వారధి వద్ద ప్రజల వరద కష్టాలు
దాదాపు నడుంలోతు నీళ్లు.. చంకలో, భుజాలపై పిల్లలు.. అవి చాలవన్నట్లు చేతిలో సంచులు.. ఇవన్నీ పట్టుకొని జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేస్తేనే బయటపడొచ్చు. అలా అని వీరేం అడువుల్లోకి వెళ్లలేదండోయ్. ఈ ఆనకట్ట దాటితేనే చాలామంది రోజువారి పనులు చేసుకోగలరు. అందుకే ఇంత కష్టపడి వెళ్తూ ప్రయాణాలు సాగిస్తున్నారు.
చంకలో బిడ్డలు, భుజాలపై సంచులతో.. వరద ప్రవాహంలో రాకపోకలు..!