నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికి 32కేసులు నమోదు అయ్యాయి. 71 ఫలితాలు రావలసి ఉంది. అందులో ఈ రోజు 41 నివేదికలు వచ్చాయి. అన్నీ నెగెటివ్‌గా రావటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరికొన్ని నివేదికలు రావలసి ఉంది. పాజిటివ్ కేసులు వచ్చిన నెల్లూరు, నాయుడుపేట, గూడూరు, టీపీ.గూడూరు ప్రాంతాల్లో రసాయనాలతో కాలనీలను శుభ్రం చేశారు. ఆ ప్రాంతాల్లో రాకపోకలు లేకుండా బారికేడ్లతో కట్టుదిట్టం చేశారు.
'కరోనా నివారణకు నెల్లూరు జిల్లాలో పటిష్ట చర్యలు' - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
కరోనా కేసులు ఎక్కువగా నమోదైన నేపథ్యంలో నెల్లూరు జిల్లా యంత్రాగం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఇవాళ వచ్చిన నివేదికల్లో అన్నీ నెగెటివ్‌గా రావటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Nellore district officials is taking steps to prevent corona virus
మీడియాతో నెల్లూరు జడ్పీ సీఇవో