ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ప్రజల్లో అవగాహన కల్పించేందుకే.. జాతీయ ఓటర్ల దినోత్సవం'

By

Published : Jan 25, 2021, 6:23 AM IST

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకున్న... జిల్లా ఉన్నతాధికారులు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడి అలరించారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే.. 11 ఏళ్లుగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు.

Nellore district officials celebrate National Voters' Day
'ప్రజల్లో అవగాహన కల్పించేందుకే.. జాతీయ ఓటర్ల దినోత్సవం'

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని.. నెల్లూరు జిల్లా ఉన్నతాధికారులు ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్ టీంల మధ్య పోటీ ఉల్లాసంగా సాగింది. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే.. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని గత 11 ఏళ్లుగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఓటర్లకు కావాల్సిన సమాచారం, ఎన్నికల నియమ, నిబంధనల కోసం ఎన్నికల సంఘం యాప్స్​ను రూపొందించిందని అన్నారు. దివ్యాంగులకు అందించే సేవలు ఇతర విషయాలపై యాప్స్​ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. అలాగే కొత్తగా ఈ ఎపిక్ కార్డులను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. ప్రజల వద్ద ఉన్న పాత ఓటర్ కార్డులను భవిష్యత్తులో ఈ ఎపిక్ కార్డులుగా మారుస్తారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details