నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు పలు గ్రామాలు చైతన్యంతో వ్యవహరిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి తమ గ్రామాలకు కొత్త వాళ్లు రాకుండా ఉండటానికి రోడ్లను దిగ్బంధనం చేస్తున్నారు. వెంకటగిరి మండలం మొగల్లా గుంట, గొట్లగుంట గ్రామాల్లో రోడ్లను కంప వేసి దిగ్బంధం చేశారు. గొట్లగుంట వాసులు ఇనుప కంచె వేసి హెచ్చరిక బోర్డ్ అంటించారు. బాలాయపల్లి మండలం భైరవరం గ్రామంలో కూడా రోడ్డుపై కంప వేసి ఇతరులను గ్రామంలోకి ప్రవేశించే అవకాశం లేకుండా చేశారు. కలువాయి మండలం నూకనపల్లి, డక్కిలి మండలం నరసనాయుడు పల్లి తదితర గ్రామాల్లోనూ ఈ తరహా చర్యలు పాటించారు.
కరోనా వైరస్ ప్రభావంతో ఇంటి నుంచి బయటకు రాకుండా ఇబ్బందులు పడుతున్న పేదలకు ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని నేతలు కోరారు.