లాక్డౌన్, 144 సెక్షన్ కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చూస్తున్నామని నెల్లూరు సంయుక్త కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ప్రజలు ఒకే చోట గుమిగూడకుండా, సమూహాలుగా తిరగకుండా నియంత్రించేందుకే నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు భయపడి ఒకేసారి నిత్యవసర వస్తువులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. కొరతగా ఉన్న నిత్యవసర వస్తువులను ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువస్తామని వెల్లడించారు. అందుకోసం ప్రత్యేకంగా జిల్లాలో 27 రైతు బజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకే ఈ కఠిన చర్యలు - 144 Section latest news in Nellore district
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు నెల్లూరు జిల్లా ఉన్నతాధికారులు పేర్కొన్నారు. నిత్యావసరాల ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.
నెల్లూరు జిల్లా సంయుక్త కలెక్టర్ వినోద్ కుమార్ ప్రెస్మీట్