ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయండి' - ded spot admission students news

డీఈడీ స్పాట్ అడ్మిషన్ విద్యార్థులకు సీఎం జగన్ న్యాయం చేయాలని.. డీఈడీ యాజమాన్య సంఘం కోరింది. వేల మంది విద్యార్థులను పరీక్షలకు అనుమతించకపోవటంతో.. వారి భవిష్యత్​ ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు.

nellore district ded convener request to cm jagan
డీఈడీ యాజమాన్యం సంఘం

By

Published : Nov 4, 2020, 3:46 PM IST

స్పాట్ అడ్మిషన్ కింద డీఈడీ కోర్సులో చేరిన విద్యార్థులకు ముఖ్యమంత్రి జగన్ న్యాయం చేయాలని.. డీఈడీ కళాశాలల యాజమాన్య సంఘం కోరింది. గతంలో డీఈడీ స్పాట్ అడ్మిషన్ విద్యార్థులకు పరీక్ష రాసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందనీ.. ఈ ఏడాది హాల్ టికెట్లు ఇవ్వకపోవటంతో ఎంతోమంది విద్యార్థులు నష్టపోతున్నారని నెల్లూరు జిల్లా డీఈడీ కళాశాల యాజమాన్య కన్వీనర్ సీతారామ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 65 వేల డీఎడ్ సీట్లు ఉండగా, కేవలం 14 వేల మందే కన్వీనర్ కోటాలో చేరారానీ.. దాదాపు 27 వేల మంది స్పాట్ అడ్మిషన్ కింద కోర్సుల్లో చేరినట్లు వివరించారు. ప్రస్తుతం స్పాట్ అడ్మిషన్ విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతించకపోవటంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతోందని వాపోయారు. ముఖ్యమంత్రి జగన్ విద్యార్థుల భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకొని.. వారికి న్యాయం చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details