నెల్లూరు జిల్లాలో కొన్నేళ్ల క్రితం సంచలనం స్పష్టించిన తల్లీ, కూతుళ్ల హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ నెల్లూరు ఎనిమిదో అదనపు జిల్లా న్యాయమూర్తి సంచలన తీర్పునిచ్చారు. 2013 ఫిబ్రవరి 12వ తేదీన నెల్లూరు నగరంలోని హరనాథపురం వద్ద ఓ గృహంలో వాగ్దేవి కళాశాల కరస్పాండెంట్ దినకర్ రెడ్డి భార్య శకుంతల, కూతురు భార్గవి దారుణ హత్యకు గురయ్యారు. దొంగతనానికి పాల్పడే క్రమంలో ఇద్దరు మైనర్లతో కలిసి బాలాజీనగర్ ప్రాంతానికి చెందిన ఇంతియాజ్ అనే వ్యక్తి వీరిని గొంతు కోసి కిరాతకంగా హతమార్చాడు. వారి ప్రాణాలు తీసిన అనంతరం దొంగతనానికి పాల్పడుతున్న సమయంలోనే ఇంటికి బంధువులు రావడం, స్థానికుల అప్రమత్తతతో దొంగలు సంఘటనా స్థలంలోనే పట్టుబడ్డారు. ఈ కేసులో నేరం రుజువు కావటంతో నిందితుడికి జీవిత ఖైదుతో పాటూ మరణ శిక్ష విధిస్తూ ఎనిమిదో అదనపు జిల్లా న్యాయమూర్తి సత్యనారాయణ సంచలన తీర్పునిచ్చారు.
తల్లీ కూతుళ్ల హత్య కేసులో... నెల్లూరు జిల్లా కోర్టు సంచలన తీర్పు
తల్లీ కూతుళ్లను కిరాతకంగా హతమార్చిన ఓ దుర్మార్గుడికి నెల్లూరు జిల్లా న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. 2013లో జరిగిన ఘటనకు సంబంధించి ఎనిమిదో అదనపు న్యాయమూర్తి గురువారం తీర్పు వెలువరించారు
The Nellore district court issued a sensational judgment
Last Updated : Feb 6, 2020, 9:09 PM IST