నెల్లూరు జిల్లాలో కరోనా పరీక్షలు పెరుగుతున్నాయని.. తద్వారా కేసులు అధికంగా నమోదవుతున్నాయని కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. గురువారం నాయుడుపేటలో పర్యటించారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. బాధితుల కోసం కొవిడ్ కేర్ కేంద్రాలను పెంచుతున్నట్లు చెప్పారు. పాజిటివ్ వచ్చి కోలుకున్న యువకులు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. దాని ద్వారా కరోనా సోకిన వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు.
'కరోనా నుంచి కోలుకున్న యువకులు ప్లాస్మా దానం చేయండి'
కరోనా నుంచి కోలుకున్న యువకులు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సూచించారు. జిల్లాలో కొవిడ్ పరీక్షలు పెంచామని.. పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని కోరారు.
నాయుడుపేటలో పర్యటించిన జిల్లా కలెక్టర్