దేశవ్యాప్తంగా అన్లాక్ ప్రారంభమైన వేళ కరోనా విజృంభించే అవకాశముందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు. నాయుడుపేటలో కోటి రూపాయలతో నిర్మించిన గాంధీ పార్కును ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ను కట్టడి చేయాలంటే ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్వరలో పాఠశాలలు మొదలవుతున్నందున.. తల్లిదండ్రులు పిల్లలను అందుకు సన్నద్ధం చేయాలన్నారు. కరోనా జాగ్రత్తలు పాటించేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు.
'పాఠశాలలకు వేళైంది.. పిల్లలను సన్నద్ధం చేయండి' - నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధరబాబు వార్తలు
త్వరలో పాఠశాలలు తెరిచే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు పిల్లలను ఇప్పటినుంటే అందుకు సన్నద్ధం చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సూచించారు. కరోనా వేళ తగిన జాగ్రత్తలు తీసుకునేలా వారికి అవగాహన కల్పించాలని కోరారు.
చక్రధరబాబు, నెల్లూరు జిల్లా కలెక్టర్