నెల్లూరు జిల్లా సైదాపురం కైవల్యనది ప్రవాహంలో ఆర్టీసీ బస్సు, మూడు ఆటోలు, లారీ చిక్కుకున్నాయి. రాపూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా నీటి ప్రవాహంలో చిక్కుకుంది. ఆటోలు, లారీలు కూడా ప్రవాహంలో చిక్కుకున్నాయి. బస్సు, ఆటోల్లో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. నీటి ప్రవాహం పెరగడంతో ఆర్టీసీ బస్సులోనూ, ఆటోలో ఉన్న ప్రయాణికులు బిక్కుబిక్కుమంటున్నారు.
కైవల్య నది ప్రవాహంలో చిక్కుకున్న వాహనాలు
కైవల్య నది ప్రవాహంలో చిక్కుకున్న వాహనాలు
19:38 November 26
వాహనాల్లో 50 మంది ప్రయాణికులు
రోడ్డు మీద ఉన్నందున ఎటువంటి ప్రమాదం లేదని, వారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. సబ్ కలెక్టర్ గోపాల కృష్ణ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసు సిబ్బంది అక్కడి చేరుకుని ప్రయాణికులకు ధైర్యం చెబుతున్నారు.
ఇదీ చదవండి : 'ముందు అంబేడ్కర్ రాజ్యాంగం అంటే ఏంటో తెలుసుకోండి'
Last Updated : Nov 26, 2020, 8:23 PM IST