సోమవారం విడుదలైన ఎస్సై ఫలితాలలో నెల్లూరు జిల్లా సంగం మండలం తలుపురుపాడుకు చెందిన పరుచూరి మహేష్ కుమార్ రాష్ట్రంలో మొదటి స్థానం సాధించారు. మొత్తం 400 మార్కులకు గానూ 255 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. ఫలితాలతో కుటుంబసభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. తల్లిదండ్రులు మాల్యాద్రి, లక్ష్మీకాంతం తమ బిడ్డకి మిఠాయి తినిపించి సంతోషం పంచుకున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన మహేష్ రాష్ట్రంలో మొదటి స్థానం సాధించడంతో గ్రామస్తులు అభినందనలు తెలిపారు. తమ గ్రామానికి మంచి పేరు తెచ్చారని ప్రశంసించారు. తల్లిదండ్రుల తోడ్పాటుతోనే ఈ ర్యాంక్ సాధించానని మహేష్ తెలిపారు.
ఎస్సై ఫలితాల్లో నెల్లూరు జిల్లావాసికి మొదటిస్థానం - talapurupadu
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఎస్సై పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. నెల్లూరు జిల్లాకు చెందిన పరుచూరి మహేష్ కుమార్ మొదటి స్థానం సాధించారు.
ర్యాంకర్