నెల్లూరు నగరం ఆరో డివిజన్లో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. అనంతరం బస్తీ వాసులకు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా 2434 వ్యాధులను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లో చేర్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు.
ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడుకు మూడేళ్లు..
జగన్ పాదయాత్ర పూర్తి చేసి మూడేళ్లు పూర్తైన సందర్భంగా నెల్లూరు ఆరో డివిజన్లో "ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు" కార్యక్రమం నిర్వహించారు.
వైద్యకళాశాలల ఏర్పాటుకు చర్యలు..
రాష్ట్రంలో మరిన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని అనిల్ వెల్లడించారు. నెల్లూరును అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.
వాటి నిర్మూలన కోసం స్పెషల్ డ్రైవ్..
పందుల సంచారం నిర్మూలనకు, కుక్కల బెడద తగ్గించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని స్పష్టం చేశారు. నరసింహకొండ ప్రాంతంలో గోశాల ఏర్పాటు చేసి నగరంలో సంచరిస్తున్న ఆవులను అక్కడికి తరలిస్తామన్నారు.
ఇవీ చూడండి : జర్నలిస్ట్ నుంచి ప్లీడర్ దాకా.. కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు రఘునందనమే