ganja illegal transportation: నెల్లూరు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో గంజాయి అక్రమరవాణా, వినియోగం జరుగుతుంది. పోలీసులు ఇటీవల అనేక సార్లు దాడులు చేసి భారీగా గంజాయిని పట్టుకున్నారు. మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు మూడో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఏ విధంగా అరికట్టవచ్చో క్షేత్ర స్థాయి సిబ్బందితో చర్చించారు.
నేషనల్ నార్కోటిక్స్ కోఆర్డినేషన్ పోర్టల్జి జిల్లాస్థాయి కమిటీ: జిల్లా కలెక్టర్ హరినారాయణన్, జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నేషనల్ నార్కోటిక్స్ కోఆర్డినేషన్ పోర్టల్జి జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అవగాహన కల్పించాలని కోరారు. అసాంఘిక ప్రదేశాలను గుర్తించాలని పోలీసులకు అధికారులు సూచించారు. ఆయా ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలని, సీసీ కెమోరాల ద్వారా రవాణాను గుర్తించాలని ఆదేశాలు ఇచ్చారు. గంజాయి నివారణకు కఠిన చర్యలు చేపట్టాలన్నారు.
విద్యార్థులకు అవగాహన కార్యక్రమం: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధానంగా పాఠశాలలు, జూనియర్ ళాశాలల సమీపంలోని దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గంజాయి వినియోగం వల్ల కలిగేటువంటిదుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. స్థానిక పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ తో అలాంటి ప్రదేశాలను గుర్తించేలా ప్రణాళికను రూపొందించినట్లు సమావేశంలో వెల్లడించారు. చీకటి ప్రదేశాల్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయడం. ఆర్టీసీ బస్సులు, పార్సిల్ రవాణా వాహనాలను విస్తృతంగా తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.