కరోనాను జయించిన వారు ప్లాస్మాను దానం చేసి ప్రాణదాతగా మారాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని రెడ్ క్రాస్ లో ప్లాస్మాథెరపీ సేకరణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.
ప్లాస్మా దానం చేయండి: నెల్లూరు కలెక్టర్ - nellore corona
కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మాను దానం చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం చేసిన వారికి ప్రోత్సాహకంగా 5వేల నగదు బహుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
ప్లాస్మా దానం చేసేందుకు మొట్టమొదటిగా, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన డాక్టర్ చంద్రశేఖర్ ను కలెక్టర్ అభినందించారు. కరోనాను జయించిన వారిలో యాంటీబాడీలు తయారవుతాయని, వీటిని ప్లాస్మా రూపంలో సేకరించి, మరో ఇద్దరు కరోనా బాధితులకు దానం చేయొచ్చని కలెక్టర్ తెలిపారు. మానవతా దృక్పథంతో కరోనా వారియర్ ప్లాస్మా దానానికి ముందుకు రావాలని కోరారు. ప్లాస్మా దానం చేసే వారికి ప్రోత్సాహకంగా ఐదు వేల రూపాయల నగదు అందజేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా బాధితులకు వైరస్ తీవ్రత బట్టి హాస్పిటల్స్ లో ప్రాధాన్యమిస్తూ చికిత్స అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి:ఈ-రక్షాబంధన్తో మహిళలకు రక్ష: సీఎం జగన్