ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో రేపటి నుంచి కొవిడ్​ వ్యాక్సినేషన్ డ్రై రన్

నెల్లూరులో కొవిడ్​ వ్యాక్సినేషన్ డ్రై రన్​ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్​ చక్రధర బాబు తెలిపారు. జిల్లాల్లోని పలు ఆసుపత్రుల్లో డ్రై రన్ చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్​కు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని కలెక్టర్​ కోరారు.

nellore collector on covid vaccination dry run
జిల్లా కలెక్టర్​ చక్రధర బాబు

By

Published : Jan 1, 2021, 7:53 PM IST

కొవిడ్​ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో శనివారం డ్రైరన్ నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ చక్రధర బాబు తెలిపారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమ సన్నద్ధతపై టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. వరికొండ పీహెచ్​సీ, నెల్లూరు జీజీహెచ్, క్రాంతి నగర్ యుహెచ్​సీలలో డ్రైరన్ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే సిబ్బందిని ఎంపిక చేసి, వారికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. వ్యాక్సిన్​కు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని.. అధికారికంగా జారీ అయ్యే సమాచారాన్నే వాస్తవంగా పరిగణించాలన్నారు. యూకే నుంచి జిల్లాకు వచ్చిన వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. ఎవ్వరికి కొత్త రకం కరోనా నిర్ధారణ కాలేదని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details