ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద ముంపు గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ - నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధరబాబు వార్తలు

వరద నీటిలో చిక్కుకున్న నెల్లూరు జిల్లా సంగం మండలం వీర్లగుడిపాడు గ్రామాన్ని కలెక్టర్ చక్రధర బాబు పడవలో వెళ్లి పరిశీలించారు. గ్రామస్థులను ఎస్డీఆర్​ఎఫ్ బృందాల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు.

nellore collector chakradhar babu visit flood prone village
వరద ముంపు గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్

By

Published : Sep 20, 2020, 3:46 PM IST

సోమశిల నుంచి పెన్నా నదిలోకి అధికారులు వరద నీటిని విడుదల చేశారు. దీంతో నదీ తీరంలో ఉన్న గ్రామాల్లోకి నీరు చేరింది. వరద నీటిలో చిక్కుకున్న నెల్లూరు జిల్లా సంగం మండలం వీర్లగుడిపాడు గ్రామాన్ని కలెక్టర్ చక్రధర బాబు పడవలో వెళ్లి పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారిని బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details