ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పాడి రైతులు కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలి' - ఏపీ కరోనా వార్తలు

కరోనా నివారణకు పాడి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ మోహన్ అన్నారు. పశువులను వైద్యశాలలకు తీసుకొచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. వైద్యులు కూడా మాస్కులు, గ్లౌజులు వేసుకోవాలన్నారు.

జాయింట్ డైరెక్టర్ విజయ్ మోహన్
జాయింట్ డైరెక్టర్ విజయ్ మోహన్

By

Published : May 26, 2020, 10:54 AM IST

కరోనా వైరస్ నివారణకు పాడిరైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ మోహన్ తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 91 ప్రకారం.. జిల్లాలోని 236 పశు వైద్యశాలలు, 116 గోపాలమిత్ర సెంటర్లలో పశువులకు వైద్యం అందిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. పశువులను వైద్యశాలకు తీసుకొచ్చే రైతులు కచ్చితంగా మాస్కు ధరించి రావాలని సూచించారు.

పశు వైద్యులు కూడా తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించి చికిత్స అందించాలని స్పష్టం చేశారు. జిల్లాలోని విజయ, దొడ్ల పాల డైరీల్లో పనిచేస్తున్న సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. ప్రతి ఒక్కరూ అన్ని జాగ్రత్తలు తీసుకొని పనిచేసినప్పుడే కరోనా వైరస్​ను అరికట్టగలమని ఆయన అభిప్రాయపడ్డారు. పశువులకు టీకాలు వేస్తున్నట్లు ఆయన చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details