ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు యాసిడ్ దాడి బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం చెన్నై తరలింపు

నెల్లూరులో యాసిడ్‌ దాడికి గురైన మైనర్‌ బాలికను మెరుగైన చికిత్స నిమిత్తం చెన్నై అపోలో హాస్పిటల్‌కు తరలించారు. తెలుగు మహిళా నేతలు అపోలో హాస్పిటల్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. బాలిక పరిస్థితి బాగానే ఉందని చెబుతున్న అధికారులు హడావుడిగా చెన్నై తరలించాల్సిన అవసరం ఏమోచ్చిందని వారు ప్రశ్నించారు.

Hospital
అపోలో హాస్పిటల్‌

By

Published : Sep 6, 2022, 4:32 PM IST

Acid Attack On Minor: నిన్న నెల్లూరులో యాసిడ్‌ దాడికి గురైన మైనర్‌ బాలికను మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలో హాస్పిటల్‌కు తరలించారు. నగరంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై మేనమామే అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. బాలిక ప్రతిఘటించడంతో గొంతు కోసి, యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాలికను చికిత్స నిమిత్తం తొలుత ప్రభుత్వ హస్పిటల్‌కు.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలో హాస్పిటల్‌కు తరలించారు.

ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేపింది. వైకాపా ప్రభుత్వంలో అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యమౌతున్నాయని.. మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తెలుగు మహిళ నేతలు అపోలో హాస్పిటల్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. బాలిక పరిస్థితి బాగానే ఉందని చెబుతున్న అధికారులు హడావుడిగా చెన్నై తరలించాల్సిన అవసరం ఏమోచ్చిందని వారు ప్రశ్నించారు. దిశ చట్టాలు తీసుకువచ్చామని ఆర్భాటపు ప్రకటనలు తప్ప వాటితో మహిళలకు ఏలాంటి న్యాయం జరగడం లేదన్నారు. వరుస ఘటనలు జరుగుతున్న ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోడంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయకుంటే ఉద్యమం చేస్తామని ప్రకటించారు.

నెల్లూరు యాసిడ్ దాడి ఘటనలో అసలేం జరిగింది:నెల్లూరు నగరానికి సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. కుటుంబ సభ్యులు సోమవారం సాయంత్రం పని మీద బయటకు వెళ్లారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉందని గుర్తించిన సొంత మేనమామ నాగరాజు ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆందోళన చెందిన ఆమె పక్కనే ఉన్న వాష్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసుకునే ప్రయత్నం చేసింది. నాగరాజు ఆమెను బలత్కరించే క్రమంలో తలుపులు బలంగా తోసుకుని లోపలికి వెళ్లాడు. అక్కడ బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో, నిందితుడు ఆమె నోట్లో, ముఖంపై యాసిడ్‌ పోశాడు. ఈ బాధ తట్టుకోలేక ఆమె పెద్దగా కేకలు వేయటంతో.. నాగరాజు కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. చుట్టుపక్కల ఇళ్లవారు వచ్చిచూడగా బాలిక రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వచ్చి బాధితురాలిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాలికపై యాసిడ్ దాడి చేసి, గొంతు కోసిన మేనమామ నాగరాజుని వెంకటాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details