పొట్టకూటి కోసం ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఓ ప్రమాదంలో చనిపోయిన మృతుడి కుటుంబానికి స్థానికులు సాయం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మౌర్య తన భార్య పిల్లలతో ఉలవదిబ్బలో నివసిస్తూ.. ఇంటీరియర్ డెకరేషన్ కార్మికుడిగా పట్టణంలో పనిచేస్తున్నాడు. పని నిమిత్తం 27వ తేదీన చేజర్లకు బైకుపై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు గాయమై మౌర్య మరణించాడు. మృతదేహాన్ని అతడి స్వరాష్ట్రానికి తరలిచేందుకు స్థానికులు సహాయపడ్డారు. మృతుడి కుటుంబానికి వారు రూ.60వేలను అందించారు. మౌర్య కుటుంబం గ్రామానికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుండగా వారిపై ఈ ప్రాంత వాసులు ఇంతటి ప్రేమను కురిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
మృతదేహాన్ని తరలించేందుకు స్థానికుల సహాయం - ఉలవదిబ్బ తాజా వార్తలు
ఓ ప్రమాదంలో చనిపోయిన వలసకార్మికుడి కుటుంబానికి నెల్లూరు జిల్లా ఉలవదిబ్బ ప్రజలు సాయం చేశారు. మృతదేహాన్ని సొంత రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు 60 వేల రూపాయలను అందించి..మానవత్వాన్ని చాటుకున్నారు.

ఉలవదిబ్బలో వలసకార్మికుడి కుటుంబానికి సాయం
Last Updated : Jun 28, 2020, 7:32 PM IST