బకాయిపడ్డ బిల్లులను వెంటనే చెల్లించాలని నెల్లూరు నగరంలోని రామలింగాపురం జలవనరుల శాఖ కార్యాలయం ఎదుట గుత్తేదారులు ధర్నా చేపట్టారు. పనులు పూర్తి చేసి మూడేళ్లు కావొస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని వాపోయారు. జిల్లాలో రూ.200 కోట్ల నీరు , చెట్టు బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు చెప్పారు. డబ్బులు చెల్లించకపోతే చాలామంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
బిల్లులు చెల్లించాలని 'నీరు- చెట్టు పథకం' గుత్తేదారుల ధర్నా - రామలింగాపురం జలవనరుల శాఖ కార్యాలయం ఎదుట గుత్తేదారులు ధర్నా
నెల్లూరులో నీరు- చెట్టు పథకం గుత్తేదారులు నిరసనకు దిగారు. తాము చేపట్టిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 200 కొట్లతో పనులు పూర్తి చేశామని ఇప్పటివరకూ ప్రభుత్వం ఎలాంటి చెల్లింపులు చేయలేదని తెలిపారు.
గుత్తేదారులు ధర్నా
TAGGED:
nellore district news