'రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడుతున్నారు' - cpi national secretery narayana
కేసుల నుంచి బయటపడేందుకే సీఎం జగన్ ఎన్ఆర్సీకి మద్దతిస్తున్నారని... సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రాజధాని విషయంలో సీఎం మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు. ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. మూడు చోట్ల రాజధానులు ఏర్పాటు చేయాలంటే... లక్ష కోట్లకు పైనే డబ్బు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. అమరావతిలోనే రాజధాని ఉంచితే రూపాయి కూడా ఖర్చు కాదన్నారు. చంద్రబాబుపై కక్షతో 5 కోట్ల మందిని ఇబ్బంది పెట్టకూడదని హితవు పలికారు.
మూడు రాజధానుల అంశంపై స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ