nara lokesh yuvagalam padayatra: జగన్ పాలనలో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి రుణం ఇవ్వలేదని.. నారా లోకేశ్ మండిపడ్డారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో లోకేశ్యువగళం పాదయాత్రలో భాగంగా.. ఆయన పలు ప్రజాసంఘాలతో భేటీ అయ్యారు. కుల్లూరు క్యాంప్ సైట్ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో సమావేశమైన లోకేశ్.. 45 ఏళ్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ ఇస్తానని జగన్ మోసం చేశాడని ఆరోపించారు. మహిళల్ని ఆదుకోవడం కోసం మహాశక్తి పథకాన్ని ప్రకటించినట్లు లోకేశ్ తెలిపారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చాడు. 5 ఏళ్లలో 90 వేలు. ప్రతి ఏడాది మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఆర్టీసి బస్సు ప్రయాణం ఉచితం, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు ఇస్తామని లోకేశ్ పేర్కొన్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అటవీ భూములు డినోటిఫై చేసి యానాదులకు కేటాయిస్తామని లోకేశ్ వెల్లడించారు.
yuvagalam padayatra: జగన్ పాలనలో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి రుణం ఇవ్వలేదు: నారా లోకేశ్
nara lokesh yuvagalam: యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ యానాది సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు సీఎం జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయామని వెల్లడించారు. అనంతరం మాట్లాడిన లోకేశ్ ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ అందరినీ ముంచేశాడని పేర్కొన్నారు.
యానాది సామాజికవర్గం ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి..పాదయాత్ర ప్రారంభంలో యానాది సామాజికవర్గం ప్రతినిధులతో నారా లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా యానాది సామాజికవర్గం వారు అడిగిన ప్రశ్నలకు లోకేశ్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో వివిధ వర్గాల మాదిరిగా... యానాదులు సైతం జగన్ బాధితులే అని నారా లోకేశ్ వెల్లడించారు. ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ అందరినీ ముంచేశాడని పేర్కొన్నారు . యానాదులు కష్ట జీవులు. కష్టాన్ని నమ్ముకున్నారన్న లోకేశ్... తాను పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తాండాలను అభివృద్ది చేసినట్లు వెల్లడించారు. తాండాల్లో మౌలిక వసతులు, రోడ్లు, త్రాగునీరు సౌకర్యం కల్పించాను.ఐటీడీఏ లు ఏర్పాటు చేసిన ఘనత టీడీపీదే అని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే 500 జనాభా ఉన్న తాండాలను పంచాయతీలుగా గుర్తించిందని లోకేశ్ వెల్లడించారు. ఎస్టీలకు వ్యవసాయ భూములు కేటాయించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చామన్న లోకేశ్... ఈ సారి సైతం అధికారంలోకి వచ్చిన వెంటనే యానాదులకు పక్కా ఇళ్లు కట్టిస్తామని పేర్కొన్నాడు. ఆయా వర్గాల దామాషా ప్రకారం కమ్యూనిటీ భవనాలు, స్మశానాలు ఏర్పాటు చేస్తామని లోకేశ్ వెల్లడించారు. సీసీ రోడ్లు మంజూరు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు
'జగన్ పాలనలో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి రుణం ఇవ్వలేదు. యానాదుల గ్రామాల్లో కనీసం రోడ్లు, త్రాగునీరు సౌకర్యం కూడా లేదు.. కరెంట్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నాం. కమ్యూనిటీ భవనాలు, స్మశానాలు లేక ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని జగన్ ఎస్టీ మహిళల్ని మోసం చేశాడని ఆరోపించారు. యానాది యువతకి ఉద్యోగాలు రావడం లేదు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకున్నారు. అధికారంలోకి వస్తే బోర్లు వేసి సాగుకి నీరు అందిస్తాం అని జగన్ మోసం చేశాడు.'- యానాదులు