ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజారెడ్డి రాజ్యాంగంలో మహనీయుల విగ్రహాలకు చోటులేదు' - ntr statue removed in kavali

నెల్లూరు జిల్లా కావలిలో ఎన్టీఆర్‌ విగ్రహం తొలగింపుపై తెదేపా నేతలు నారా లోకేశ్, దేవినేని ఉమ మండిపడ్డారు. రాజారెడ్డి రాజ్యాంగంలో మహనీయుల విగ్రహాలకు చోటులేదనేది అర్థమైందని విమర్శించారు.

NTR statue in kavali
NTR statue in kavali

By

Published : Jul 19, 2020, 12:46 PM IST

నెల్లూరు జిల్లా కావలిలోని ముసునూరు మాలక్ష్మమ్మ దేవస్థానం కూడలిలో ఉన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహం తొలగింపుపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 90 కేసులు ఉన్న క్రిమినల్​కి కాంస్య విగ్రహం పెడతామని స్వయంగా మంత్రి ప్రకటించినప్పుడే రాజారెడ్డి రాజ్యాంగంలో మహనీయుల విగ్రహాలకు చోటులేదనేది అర్థమైందని విమర్శించారు. బాపట్లలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహం, ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. జగన్ గ్యాంగ్​కి ప్రజలే బుద్ధి చెబుతారని లోకేశ్ అన్నారు.

అధికార మదం తలకెక్కి ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించారని మాజీమంత్రి దేవినేని ఉమా విమర్శించారు. వైకాపా ప్రజాప్రతినిధులు ఇటువంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతుంటే ముఖ్యమంత్రి జగన్ ఏం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details