నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ ఛైర్పర్సన్గా నక్క భానుప్రియను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ ఛైర్పర్సన్గా చింతపట్ల ఉమామహేశ్వరిని ఎన్నుకున్నారు. 24వ వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా భానుప్రియ గెలుపొందారు.
22వ వార్డు నుంచి ఉమామహేశ్వరి విజయం సాధించారు. వెంకటగిరిలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రిసైడింగ్ అధికారిగా జేసీ బాపిరెడ్డి వ్యవహరించారు.