ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మట్టి మాఫియాను ప్రశ్నించిన దళితనేతపై దాడికి పాల్పడటం దారుణం' - Nakka Anandababu news

నెల్లూరు జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియాపై తెదేపానేత నక్కా ఆనంద్​బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీనేతల అండదండలతో అనధికారికంగా వందల కోట్లల్లో ఈ మట్టి దందా జరుగుతోందని నక్కా ఆరోపించారు. ఈ దందాకు అడ్డొచ్చిన దళితులపై సైతం వైకాపా గుండాలు దాడులకు పాల్పడటం దుర్మార్గమన్నారు.

Nakka Anandababu
Nakka Anandababu

By

Published : Jun 19, 2021, 9:44 PM IST

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో మట్టి మాఫియాను ప్రశ్నించిన దళిత నాయకుడు కరకటి మల్లిఖార్జునపై వైకాపా గూండాలు దాడి దుర్మార్గమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో.. అనధికారికంగా వందల కోట్లల్లో మట్టి మాఫియా నడుస్తోందని విమర్శించారు.

కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డే ఈ దందాను నడుపుతూ.. చెరువుకట్టలు, వాగులు, వంకలు తేడా లేకుండా మట్టిని తవ్వి అమ్మేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన మల్లిఖార్జునపై ఈ నెల 16న వైకాపా గూండాలు దాడిచేయటంతోపాటు అక్రమ కేసులు నమోదు చేయించారన్నారు. పోలీసులు దాడి చేసిన వారిని వదిలి.. బాధితుడిపై కేసు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. గత నెల రోజుల్లో 15మంది దళిత యువకులపై ఇదే తరహాలో అక్రమ కేసులు పెట్టారన్నారు. పెద్ద ఎత్తున మట్టి, గ్రావెల్ మాఫియా రెచ్చిపోతున్నా.. జలవనరులు, రెవెన్యూ, పోలీసు విభాగాలు పట్టించుకోకపోగా.. మాఫియాకు సహకరిస్తున్నాయని ఆరోపించారు.

ఇదీ చదవండి:

Fake cotton Seeds Seized: నకిలీ పత్తి విత్తనాల తయారీ ముఠా అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details