ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రైవేటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం' - జనసేన నేత నాదెండ్ల మనోహర్ వార్తలు

తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా..ఈ నెల 12న నెల్లూరు జిల్లాలో నిర్వహించే సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సభా వేదికను జనసేన ప్రధాన నేత నాదెండ్ల మనోహర్ పరిశీలించారు.

Nadendla Manohar
నాదెండ్ల మనోహర్

By

Published : Apr 10, 2021, 8:05 PM IST

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుందని... ప్రైవేటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉందని జనసేన ప్రధాన నాయకులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట ఏఎల్సీఎం ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 12న జరిగే బహిరంగ సభకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇతర ప్రముఖులు రానుండటంతో సభా వేదికను ఆయన పరిశీలించారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా.. భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details