ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MVI Suspended: ఈశాన్య రాష్ట్రాల ట్యాంకర్లకు ఏపీలో రిజిస్ట్రేషన్.. ఎంవీఐపై సస్పెన్షన్ వేటు - నెల్లూరు ఎంవీఐపై సస్పెన్షన్ వేటు

MVI Suspended: ఈశాన్య రాష్ట్రాల ట్యాంకర్లకు నెల్లూరులో రిజిస్ట్రేషన్‌ చేయటంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారంలో సూళ్లురుపేట ఎంవీఐ గోపీనాయక్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఘటనపై దర్యాప్తు చేయాలని మంత్రి పేర్ని నాని అధికారులను ఆదేశించారు.

ఎంవీఐపై సస్పెన్షన్ వేటు
ఎంవీఐపై సస్పెన్షన్ వేటు

By

Published : Dec 21, 2021, 10:39 PM IST

MVI Suspended: ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆయిల్ ట్యాంకర్ల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మోటారు వెహికిల్ ఇన్​స్పెక్టర్ గోపీనాయక్​ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్​కు చెందిన 200కు పైగా వాహనాలను నెల్లూరు జిల్లాలో రిజిస్ట్రేషన్ చేస్తున్న వ్యవహారంపై విచారణ జరిపిన రవాణాశాఖ మంత్రి పేర్నినాని సూళ్లూరుపేట ఎంవీఐని సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు.

దీంతో పాటు గూడూరు ఆర్టీవో మల్లికార్జున రెడ్డిని తక్షణమే ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా పశ్చిమగోదావరి జిల్లా డిప్యూటీ ట్రాన్స్​పోర్టు కమిషనర్ ఆనంద్​ను విచారణ అధికారిగా నియమించారు.

ఇదీ చదవండి: acb raids: రిజిస్ట్రార్ కార్యాలయంలో అనినీతి అధికారుల సోదాలు

ABOUT THE AUTHOR

...view details