ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైనారిటీ నేత షాపు ముందు భాగం తొలగింపు.. నెల్లూరు వైసీపీలో బయటపడ్డ వర్గపోరు

Sectarian Differences In YCP : నెల్లూరు జిల్లాలోని మరోసారి వైఎస్సార్​సీపీ పార్టీలోని వర్గ విభేదాలు బయటపడ్డాయి. నగరంలోని మైనార్టీ నేత దుకాణం ముందు భాగం మున్సిపాలిటీ అధికారులు తొలగించటంపై డిప్యూటీ మేయర్​ రూప్​ కుమార్​ యాదవ్​ స్పందించారు. కక్షపూరితంగా దుకాణ ముందు భాగాన్ని తొలగించారని మండిపడ్డారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Dec 28, 2022, 6:02 PM IST

Updated : Dec 28, 2022, 7:24 PM IST

Sectarian Differences in Nellore YCP : నెల్లూరులో వైసీపీ నేతల మద్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. వైసీపీ నేత మున్వర్​కి చెందిన బట్టల దుకాణం ముందు భాగం తొలగించటంపై.. కార్పొరేషన్​ డిప్యూటీ మేయర్​ రూప్​ కుమార్​ యాదవ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్​ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నందుకే కక్షపూరితంగా దుకాణం ముందు భాగాన్ని తొలగించారని ఆరోపించారు. అర్ధరాత్రి సమయంలో దొంగల్లా వచ్చి మెట్లు పడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల చేత ఎవరు ఈ పని చేయించారో తమకు తెలుసని ఆయన అన్నారు. నెల్లూరులో జరుగుతున్న సంఘటనలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని కోరారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధిష్టానంపై ఉందన్నారు.

​"ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా సయ్యద్​ మున్వర్ కేక్​ కోసినందుకు, మున్సిపల్​ అధికారులు దుకాణం ముందు భాగాన్ని తొలగించారు. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో.. దొంగల్లాగా ముస్లీం మైనార్టీ వర్గానికి చెందిన వైసీపీ నాయకుడి దుకాణా మెట్లను తొలగించారు. దీని వెనక ఉండి నడిపించిన నాయకుడు ఎవరో తెలుసు. నెల్లూరులో ఎన్నో దుర్మార్గాలు జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చాయి." -రూప్‌కుమార్ యాదవ్, నెల్లూరు కార్పొరేషన్​ డిప్యూటీ మేయర్

రూప్‌కుమార్ యాదవ్, నెల్లూరు కార్పొరేషన్​ డిప్యూటీ మేయర్

ఇవీ చదవండి:

Last Updated : Dec 28, 2022, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details