ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్లాస్టిక్ పై నిఘాతో తెరచుకోని దుకాణాలు

ప్లాస్టిక్ సంచులు వాటకంపై నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. హోల్ సేల్ వ్యాపారులపై ప్రత్యేక నిఘా పెట్టడంతో షాపుల యజమానులు దుకాణాలను తెరిచేందుకు ఆసక్తి చూపలేదు. ఈ దాడుల్లో భారీ స్థాయిలో ప్లాస్టిక్ కవర్ల బాక్సులను స్వాధీనం చేసుకున్నారు.

municipal offers raids on shops in nayudupeta in nellore

By

Published : Sep 1, 2019, 11:27 AM IST

నాయుడుపేటలో భారీగా పట్టుపడిన ప్లాస్టిక్ సంచులపెట్టెలు..

నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘంలో ప్లాస్టిక్ కవర్ల వాడకంపై అధికార్ల దాడులు కొనసాగుతున్నాయి.నగరంలో భారీ స్థాయిలో ప్లాస్టిక్ కవర్లును స్వాధీనం చేసుకున్నారు.వినాయక చవితి పండుగకు ప్లాస్టిక్ కవర్ల విక్రయాలు జరిగే అవకాశం ఉండటంతో,మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలోని అధికార్ల బృందం అన్ని షాపులపై నిఘా పెట్టారు.దీంతో హోల్ సేల్ వ్యాపారులు చాలా సేపటి వరకు షాపులను తెరవకుండా కాలయాపన చేస్తున్నారు.మరి కొన్ని షాపుల్లో ప్లాస్టిక్ సంచులను గుర్తించిన అధికార్లు వారిపై జరిమానాలు విధించారు.

ABOUT THE AUTHOR

...view details