నెల్లూరు జిల్లా ఆత్మకూరు పుర పాలక సంఘానికి సంబంధించిన ఎన్నికల ఏర్పాట్ల పై మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ కార్యాలయంలో పలువురు అధికారులు పాల్గొని ఏర్పాటపై కమిషనర్‌కు వివరించారు. వార్డుల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా.. బెదిరిపులకు భయపడక ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు కోరారు.
పురపాలక ఎన్నికల ఏర్పాట్లపై.. మున్సిపల్ కమిషనర్ సమీక్ష - ఎన్నికలపై మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు సమీక్ష తాజా వార్తలు
మార్చి 10న జరగనున్న పురపాలక ఎన్నికల ఏర్పాట్లపై.. ఆత్మకూరు పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, సీఐలు సమీక్ష నిర్వహించారు. వార్డుల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పురపాలక ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష