ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పందులను పట్టుకునేందుకు వచ్చినవారిపైనే పెంపకందారులు దాడికి దిగారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో పందుల బెడద తప్పించేందుకు మున్సిపల్ అధికారులు.. చెన్నై నుంచి ప్రత్యేక బృందాన్ని పిలిపించారు. వాళ్లను అడ్డుకున్న పందుల పెంపకందారులు.. సిబ్బందిపై తిరగబడ్డారు. పందులను తరలించేందుకు తీసుకొచ్చిన లారీపై రాళ్లదాడి చేశారు. లారీ అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. చివరకు.. పోలీసు బందోబస్తు మధ్య పందులను తరలించారు.
పందుల బెడద తప్పించేందుకు అధికారులు చర్యలు.. - పందుల తరలింపుకు అధికారులు చర్యలు తాజావార్తలు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో పందుల బెడద తప్పించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. చెన్నై నుంచి ప్రత్యేక బృందాన్ని పిలిపించి పందుల తరలింపు చర్యలు చేపట్టారు. ఫలితంగా పందుల పెంపకం దారులు సిబ్బందిపై తిరగబడ్డారు. పందులను తరలించేందుకు తీసుకొచ్చిన లారీపై రాళ్లదాడి చేయటంతో.. పరిస్థతి ఉద్రిక్తంగా మారింది.
పందులు తరలిస్తున్నారని పెంపకం దారులు ఆందోళన