ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆత్మకూరులో మున్సిపల్ కార్మికుల ఆందోళన - ఆత్మకూరులో మున్సిపల్ కార్మికుల ర్యాలీ వార్తలు

వేతనాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. వర్షంలోనూ తమ నిరసనను తెలియజేశారు.

muncipal workers dharna
ఆత్మకూరులో మున్సిపల్ కార్మికుల ఆందోళన

By

Published : Nov 26, 2020, 4:32 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. సకాలంలో వేతనాలు చెల్లించాలని ఏఐటీయూ ఆధ్వర్యంలో వర్షంలోనూ ర్యాలీ చేశారు. పని వారాలు తగ్గించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ కష్టాన్ని గుర్తించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. 3, 4 నెలల వరకు జీతాలు ఇవ్వడం లేదని వాపోయారు. జీతాలు ఇవ్వకపోతే ఆందోళనను కొనసాగిస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details