ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి - నెల్లూరు జిల్లా తాజా వార్తలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో బుధవారం జరిగే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్తున్న ఎన్నికల సిబ్బంది
బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్తున్న ఎన్నికల సిబ్బంది

By

Published : Mar 9, 2021, 5:09 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో బుధవారం జరగనున్న ఎన్నికలకు అధికారులకు అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని మెుత్తం 23 వార్డులు ఉండగా 6 వార్డుల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. మిగతా 17 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్యాంపు నుంచి ఎన్నికల సిబ్బంది సామగ్రితో.. ఎన్నికలు జరిగే వార్డులకు వాహనాల ద్వారా తరలివెళ్లారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు.

వెంకటగిరికి పురపాలక హోదా వచ్చాక మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 25 వార్డులకు 3 స్థానాలను వైకాపా ఏకగ్రీవం చేసుకుంది. మిగతా 22 వార్డులకు 58 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇందులో 21 స్థానాల్లో తెదేపా అభ్యర్థులు వైకాపాతో గట్టి పోటీలో ఉన్నారు. జనసేన, భాజపా, సీపీఐ, స్వతంత్ర అభ్యర్ధులు పలువురు బరిలో నిలిచారు.

ఇదీ చదవండి: 'పప్పు, శనగలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం'

ABOUT THE AUTHOR

...view details