ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్

నెల్లూరు జిల్లాలో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. కొన్నిచోట్ల ఓటర్లు లేక కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.

nellore parishat elections
నెల్లూరు జిల్లాలో కొనసాగుతోన్న పరిషత్ ఎన్నికల పోలింగ్

By

Published : Apr 8, 2021, 11:32 AM IST

నెల్లూరు జిల్లాలో పరిషత్ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 46 జడ్పీటీసీ స్థానాలకు ఇప్పటికే 12 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన స్థానాల కోసం 104మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో 554 ఎంపీటీసీ స్థానాలకు గాను 188 ఏకగ్రీవం అయ్యాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

ఉదయగిరి నియోజకవర్గంలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. నియోజకవర్గంలో 57 ఎంపీటీసీ, 6 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

నాయుడుపేట మండలంలో తిమ్మాజిగకండ్రిగ, మేనకూరు, భీమవరం, గొట్టుప్రోలులో పరిషత్ ఎన్నికల పోలింగ్​ మందకొడిగా సాగుతోంది. ఎన్నికల హడావుడి కనిపించడం లేదు.

సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రంలో ఎంపీటీసీ ఎన్నికలలో పలువురు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జిల్లా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి:పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంపై ప్రత్యేక తపాలా కవరు

ABOUT THE AUTHOR

...view details