ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MPTC escape: రూ.50 లక్షలతో ఎంపీటీసీ పరార్ - నెల్లూరు జిల్లా తాజా సమాచారం

రూ.50 లక్షలతో ఎంపీటీసీ పరారైన(MPTC escape) ఘటన నెల్లూరు జిల్లా(Nellore district)లో జరిగింది. జిల్లాలోని ఓ ప్రైవేటు కళాశాలకు సంబంధించిన నగదును బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లి.. పరారైనట్లు కళాశాల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఎంపీటీసీ పరార్
MPTC escape

By

Published : Sep 24, 2021, 4:29 PM IST

నెల్లూరు జిల్లా(Nellore district) కోవూరు మండలం చెర్లోపాళెం ఎంపీటీసీ శ్రీహరి రూ.50లక్షల నగదుతో పరారయ్యాడు(MPTC escape with Rs 50 lakhs). జిల్లాలోని ఓ ప్రైవేటు కళాశాలకు సంబంధించిన నగదు తీసుకుని పరారైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. బ్యాంకులో జమ చేసేందుకు 50లక్షల రూపాయల నగదు తీసుకుని వెళ్లిన శ్రీవారి.. కనిపించడం లేదని, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని కళాశాల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న దర్గామిట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details