తాగునీటిని సమస్యను పరిష్కరించాలని కోరుతూ... నెల్లూరులోని ఉదయగిరి మండలంలో రైతు సంఘం నాయకులు ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. జిల్లా నాయకుడు వెంకటయ్య ఆధ్వర్యంలో కార్యాలయ తలుపులు మూసివేసి..ధర్నా చేశారు. అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తక్షణమే గ్రామాల్లో పర్యటించి... తాగునీటి సమస్యకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా వలసల నివారణకు పూర్తిస్థాయిలో ఉపాధి హామీ పనులు చేపట్టాలన్నారు. ఎంపీడీవో హనుమంతరావు సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
సమస్యలు పరిష్కరించాలంటూ ఎంపీడీవో కార్యాలయం ముట్టడి - ఉదయగిరి
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని గ్రామాల్లో తలెత్తిన తాగునీటి సమస్యతో పాటు.. ప్రజలు ఎదుర్కొనే ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. రైతు సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు.

సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో కార్యాలయం ముట్టడి
సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో కార్యాలయం ముట్టడి
ఇవీ చదవండి...'నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి'