ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గ్రావెల్ తవ్వకాలతో ఎంపీ మాగుంటకు సంబంధం లేదు' - నెల్లూరు జిల్లా ముఖ్య వార్తలు

సర్వేపల్లి రిజర్వాయర్ గ్రావెల్ తవ్వకాలకు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎలాంటి సంబంధం లేదని నెల్లూరు జిల్లా ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణమోహన్ వెల్లడించారు. మాగుంట పేరుతో వైకాపా నేతలు అక్రమంగా గ్రావెల్ తరలించినట్లు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎస్ఈ వివరణ ఇచ్చారు.

మాట్లాడుతున్న ఎస్ఈ
మాట్లాడుతున్న ఎస్ఈ

By

Published : Aug 8, 2021, 9:30 PM IST

సర్వేపల్లి రిజర్వాయర్ గ్రావెల్ తవ్వకాలకు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎలాంటి సంబంధం లేదని నెల్లూరు జిల్లా ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణమోహన్ వెల్లడించారు. మాగుంట పేరుతో వైకాపా నేతలు అక్రమంగా గ్రావెల్ తరలించినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎస్ఈ వివరణ ఇచ్చారు. సర్వేపల్లి రిజర్వాయర్​లో కమర్షియల్ పర్పస్ కోసం గ్రావెల్ కావాలని ఉదయ్ కుమార్ రెడ్డి, ఎం.శ్రీనివాసులు రెడ్డి, శ్రీధర్ రెడ్డి దరఖాస్తు చేసుకోగా తాము అనుమతిచ్చామని తెలిపారు. 8 వేల క్యూబిక్ మీటర్లకు తాము అనుమతిస్తే, వారు 18 వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించారని చెప్పారు.

అనుమతికి మించి గ్రావెల్ తరలిస్తుండటంపై తాము అభ్యంతరం చెప్పినా.. వారు పట్టించుకోలేదన్నారు. రాత్రి 11 గంటల సమయంలో తాము వెళ్లి గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్నామని చెప్పారు. తామిచ్చిన అనుమతి అంటే 10 వేల క్యూబిక్ మీటర్లు అధికంగా గ్రావెల్ తరలించడంతో 10 లక్షల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాలని నోటీసులు ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

ఎం.శ్రీనివాసులు రెడ్డి పేరును మాగుంట శ్రీనివాసులు రెడ్డిగా చూపుతూ వార్తలు రావడం సరికాదన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈ గ్రావెల్ తవ్వకాలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయితే ఎం. శ్రీనివాసులు రెడ్డి ఎవరనేది తమకు తెలియదని.. ఆ విషయం విచారణలో బయటపడుతుందని చెప్పారు.

ఇదీ చదవండి:

భారీగా అక్రమ మద్యం పట్టివేత.. అదుపులో నిందితులు

ABOUT THE AUTHOR

...view details